క్లిక్ అవుతుందా, ఖాళీ చేస్తుందా!

Flops haunt Pooja Hegde!
Monday, June 19, 2017 - 17:30

ప్రస్తుతం పూజా హెగ్డేపై అంతా ఇలాంటి బెట్టింగ్ లే కాస్తున్నారు. ఎందుకంటే తెలుగులో ఆమెకన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైంది. ఇలాంటి టైమ్ లో డీజే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వరించింది పూజాకు. ఈ సినిమా క్లిక్ అయితే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ల రేసులోకి ఎంటర్ అవుతుంది. లేదంటే మాత్రం ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ గా మరోసారి ఫేడవుట్ అవ్వడం ఖాయం.

తెలుగులో ఇప్పటికే 'ముకుంద', 'ఒక లైలా కోసం' సినిమాలు చేసింది పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలూ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. అందుకే స్టార్ హీరోల సినిమా ఛాన్సులు కూడా రాలేదు. దీంతో టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు అల్లు అర్జున్ సరసన 'డీజే' సినిమాలో నటించింది పూజా హెగ్డే. నిజానికి డీజేతో సంబంధం లేకుండానే ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. నెక్ట్స్ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా కోటి చేసేసింది. కాకపోతే అది కేవలం హైప్ మాత్రమే. డీజే హిట్ అయితేనే ఆమెకు సిసలైన క్రేజ్ మొదలైనట్టు లెక్క. అందుకే డీజేతో ఆమె క్లిక్ అవుతుందా.. లేక ఖాళీ చేసి వెళ్లిపోతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.

మరి దువ్వాడ ఈ చిన్నదాన్ని ఆదుకుంటాడా?