ప‌ర‌భాషా ద‌ర్శ‌కుల‌తో గోపిచంద్ బిజీ

Gopichand to work with other language directors
Monday, December 10, 2018 - 17:30

కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్‌కి స‌డెన్‌గా వ‌రుస‌గా సినిమాలు వ‌స్తున్నాయి. కొత్త ఏడాదిలో గోపిచంద్ ప‌రభాషా ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే 96 అనే త‌మిళ సినిమాకి హీరోగా అత‌న్ని అప్రోచ్ అయ్యారు. అది ఇంకా ఏ విష‌యం తేల‌లేదు. ఈ సినిమా అత‌ను చేస్తాడా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే..తాజాగా రెండు కొత్త సినిమాల‌ను అంగీక‌రించాడ‌ట‌. ఈ రెండు కూడా ఇత‌ర భాష‌ల‌కి చెందిన ద‌ర్శ‌కులే డైర‌క్ట్ చేయ‌నుండ‌డం విశేషం. 

విశాల్ హీరోగా నాను సిగ‌ప్పు మ‌నిథ‌న్ (తెలుగులో ఇంద్రుడు) వంటి సినిమాలు డైర‌క్ట్ చేసిన తిరు చెప్పిన ఒక క‌థ‌ని గోపిచంద్ ఓకే చేశాడ‌ట‌. ఈ సినిమాని ఏటీవీ అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంది. 

అలాగే ఒక మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు గ‌ణేష్ చెప్పిన క‌థ కూడా న‌చ్చి..ఆ ద‌ర్శ‌కుడిని ఆ క‌థ‌పై వ‌ర్క్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. గోపిచంద్‌కి రీసెంట్‌గా స‌రైన విజ‌యాలు లేవు. ఐతే గోపిచంద్ సినిమాల‌కి హిందీ డ‌బ్బింగ్‌, శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తం వ‌స్తుంటుంది. అత‌నితో చక్క‌టి బ‌డ్జెట్ ప్లాన్‌తో సినిమా తీస్తే.. థియేట‌ర్ నుంచి పెద్ద‌గా డ‌బ్బులు రాక‌పోయినా బండి లాగించొచ్చు. నిర్మాత‌లకి న‌ష్టం రాదు. ఐతే బ‌డ్జెట్ మించిన‌పుడే స‌మ‌స్య వ‌స్తుంది.