చ‌దువు క‌న్నా దానిపైనే ఆస‌క్తి!

Haripriya says she never had interest in studies
Saturday, January 13, 2018 - 19:15

"జై సింహా" సినిమాలో మంగ‌గా న‌టించిన హ‌రిప్రియ త‌న గురించి అనేక విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

తాను పెద్ద‌గా చ‌దువుకోలేద‌ని కుండ‌బ‌ద్దలుకొట్టిన‌ట్లు చెప్పింది. చ‌దువుకుంటున్న టైమ్‌లోనే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో అవ‌కాశం వ‌చ్చిందగ‌. సినిమాల్లో అవ‌కాశం వ‌స్తే... ఆ ఆనందాన్ని ఎవ‌రు కాద‌నుకుంటారో చెప్పండి. అందుకే చ‌దువు ప‌క్క‌న పెట్టి సినిమాల్లోకి వ‌చ్చా అని తెలిపింది. చ‌దువు క‌న్నా సినిమాల‌పైనే ఆస‌క్తి ఎక్కువ, అందుకే చ‌దువు పూర్తి చేయ‌లేద‌ని తెలిపింది.

బాల‌య్య సినిమాలో ఆమెకి విచిత్రంగా అవ‌కాశం ద‌క్కింది. మొద‌ట హ‌రిప్రియ‌ని క‌న్సిడ‌ర్ చేయ‌లేదు. ఇత‌ర పెద్ద హీరోయిన్ల‌ని అప్రోచ్ అయింది టీమ్‌. ఐతే స‌డెన్‌గా ఆమె పేరుని టీమ్ అనౌన్స్ చేయ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సినిమాలో ఎలా అవకాశం వ‌చ్చిందో ఆమె తెలిపింది. నారా జయశ్రీదేవి నిర్మిస్తున్న‌ ‘కురక్షేత్ర’ అనే క‌న్న‌డ చిత్రంలో నటిస్తుండ‌గా జ‌య‌శ్రీదేవి గారు అడిగారు బాల‌య్య సినిమాలో న‌టిస్తావా అని. ‘జైసింహా’ నిర్మాత క‌ల్యాణ్ గారు జ‌య‌శ్రీదేవికి క్లోజ్‌. రెండో హీరోయిన్ కోసం వెతుకుతున్నార‌ని తెలుసుకున్న జ‌య‌శ్రీదేవి నా పేరు స‌జెస్ట్ చేశారు. అలా అవ‌కాశం ద‌క్కింది, అని చెప్పింది హ‌రిప్రియ‌.

ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో బాల‌య్య ద్వారా చాలా నేర్చ‌కున్నాన‌ని అంటోంది హ‌రిప్రియ‌.