ఆ రెండే ఇష్టం ఇలియానా

Ileana names her favorite Telugu films
Wednesday, July 25, 2018 - 20:00

"దేవ‌దాసు" సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఇలియానా టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించింది. "పోకిరి" వంటి సంచ‌ల‌న చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఐతే ఆమె న‌టించిన తెలుగు చిత్రాల్లో ఆమెకిష్ట‌మైనవి మాత్ర‌మే రెండేన‌ట‌. ఒక‌టి...జ‌ల్సా. రెండోది కిక్‌. రెండూ హిట్ సినిమాలే.

చాలా గ్యాప్ త‌ర్వాత ఇలియానా మ‌ళ్లీ తెలుగు సినిమాలో న‌టిస్తోంది. ర‌వితేజ స‌ర‌స‌న "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ"లో ఆమె క‌థానాయిక‌. ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత న‌టిస్తుండ‌డంతో కొంత షైగా ఉంది అంటోంది. ఐతే తెలుగులో మ‌ళ్లీ పాత్ర‌లు రావ‌డం సంతోషంగా అనిపిస్తోందని కూడా చెపుతోంది.

ఇలియానా గ‌తేడాది ఆస్ట్రేలియ‌న్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూని పెళ్లాడింది. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె సినిమాల్లో న‌టిస్తోంది. అందాల ఆర‌బోత చేస్తోంది. నా జీవితంలో అత్యంత పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వ్య‌క్తి త‌న భ‌ర్త ఆండ్రూనే అని కూడా చెప్పింది. ఈ విష‌యాల‌న్నీ త‌న అభిమానులతో సోష‌ల్ మీడియాలో జ‌రిపిన చాట్ సంద‌ర్బంగా వెల్ల‌డించింది.