జాన్విది మౌనమే సమాధానం
Submitted by tc editor on Sat, 2019-01-19 15:59
Jahnvi Kapoor evades queries on Sridevi Bungalow
Saturday, January 19, 2019 - 16:00

ప్రియా వారియర్ నటిస్తోన్న శ్రీదేవి బంగ్లా అనే సినిమాపై చాలా రాద్దాంతం జరుగుతోంది. శ్రీదేవి మరణించిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంగానే ఈ సినిమాని తీస్తున్నారనే ప్రచారం ఉంది. శ్రీదేవి బంగ్లా ట్రయిలర్ విడుదలైన వెంటనే శ్రీదేవి భర్త బోనీకపూర్ స్పందించి ..మేకర్స్‌కి లీగల్ నోటీసులు పంపాడు.
ఐతే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ మాత్రం ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరిస్తోంది. తాజాగా జాన్వీ ఒక కార్యక్రమానికి విచ్చేసింది. అక్కడ మీడియా ఆమెని ఈ సినిమా గురించి ప్రశ్నించింది. కానీ ఆమె సమాధానం చెప్పకుండా... ప్రశ్న విని మౌనంగా ఉండిపోయింది. మీడియా మరీ మరీ అడుగుతుండడంతో.. ఆమె టీమ్ రంగంలోకి దిగి జాన్వీని పక్కకు తీసుకెళ్లిపోయింది.
- Log in to post comments