బీజేపీవైపు జ‌య‌ప్ర‌ద చూపు

Jaya Prada likely to join BJP
Monday, March 25, 2019 - 17:15

ఒక‌పుడు అందానికి మారుపేరు జ‌య‌ప్ర‌ద‌. త‌న గ్లామ‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న న‌టి ఆమె. జ‌య‌ప్ర‌ద‌కి రాజ‌కీయాలు కూడా కొత్తేమీ కాదు. గ‌తంలో కొన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ త‌ర్వాత స‌మాజ్‌వాదీ పార్టీలో చేరి పోటీ కూడా చేశారు.

మ‌రోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాజకీయాల్లోనే మళ్లీ యాక్టివ్ కానున్నార‌ట‌. జయప్రద బీజేపీలో చేరనున్నార‌నేది తాజా సమాచారం. ఆమె స్నేహితుడు అమ‌ర్ సింగ్ ఈ విష‌యాన్ని మీడియాకి తెలియ‌చేశాడు. ఐతే ఇంత‌వ‌ర‌కు ఆమెకి బిజేపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్క‌లేదు. 55 ఏళ్ల జ‌య‌ప్ర‌ద చాలా కాలంగా లైమ్‌లైట్‌లో లేరు.

విజ‌య‌శాంతిలాగే రాజ‌కీయంగా ఆమె ఎటూ కాకుండా ఉన్నారు ఇప్ప‌టి వ‌ర‌కు. ఇపుడు మ‌రోసారి పొలిటిక‌ల్‌గా బిజీ కావాల‌నేది ఆమె ఆశ‌. బీజేపీ కూడా గ్లామ‌ర్ ట‌చ్ కోరుకుంటోంది యూపీలో.