జ‌య‌ప్ర‌ద‌ని వేధించిన ఖిల్జీ

Jaya Prada says she was harassed by 'Khilji' Azam Khan
Saturday, March 10, 2018 - 16:45

"ప‌ద్మావ‌త్" సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సినిమాలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర క‌న్నా ఖిల్జీ పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్యం ద‌క్కింది. ప‌ద్మావ‌తి అందం గురించి క‌థ‌లు క‌థ‌లుగా విన్న క్రూరుడైన రాజు ఖిల్జీ...ఆమెని ఎలాగైనా చూడాల‌ని చిత్తోడ్‌పై దండ‌యాత్ర చేస్తాడు. దాదాపుగా నా జీవితంలో కూడా ఓ ఖిల్జీ ఉన్నాడ‌ని ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్ జ‌య‌ప్ర‌ద తాజాగా కామెంట్ చేశారు.

ప‌ద్మావతిని వేదించిన‌ట్లు త‌నని కూడా ఓ ఖిల్జీ వేధించాడ‌ని  ఈ మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. 2009 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన సొంత పార్టీ సమాజ్ వాదీకి చెందిన ఆజమ్ ఖాన్ తనను వేధించారని ఆమె అన్నారు.  

"పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీని చూస్తున్నప్పుడు నాకు ఆజమ్ ఖాన్ గుర్తొచ్చారు. 2009 రాంపూర్ ఎన్నికల్లో నన్ను అప్రతిష్ట పాల్జేయడానికి అజాంఖాన్ ఎన్నో ఎత్తులు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే నన్ను వేధింపులకు గురిచేశారు. అయినప్పటికీ అప్పుడు నేను గెలిచాను." జయప్రద చెబుతున్న మాటిది.

ఈ రాజకీయ ఆరోపణలు, వివాదాల సంగతి పక్కనపెడితే జయప్రద వ్యాఖ్యలపై ట్విట్టర్ లో కామెడీగా ట్వీట్లు పడుతున్నాయి. 55 ఏళ్ల జ‌య‌ప్ర‌ద త‌న‌ని దీపిక ప‌దుకొనేతో కంపేర్ చేసుకుంటుందా అని స‌ర‌దాగా ట్రాలింగ్ మొద‌లైంది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.