అది ఫేక్ న్యూస్ అంటున్న నాని

Jersey team denies of news about climax part
Thursday, March 7, 2019 - 14:30

నాని న‌టించిన "జెర్సీ" సినిమా వచ్చే నెల‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఐతే ఈ సినిమా కోసం రెండు క్ల‌యిమాక్స్‌లు చిత్రీక‌రించార‌నీ, ఏ క్ల‌యిమాక్స్‌ని పెట్టాల‌నేది ఇంకా ద‌ర్శ‌కుడు నిర్ణ‌యించుకోలేక‌పోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇందులో నిజం లేదంటోంది "జెర్సీ" టీమ్‌.

రెండు క్లయిమాక్స్‌లు తీశార‌న్న‌ది త‌ప్పు అని క్లారిటీ ఇచ్చింది "జెర్సీ" టీమ్‌. ఏ క్ల‌యిమాక్స్ పెట్టాల‌నుకున్నామో అది ఇప్ప‌టికే చిత్రీక‌రించాం, అంతే త‌ప్ప ఎండింగ్ విష‌యంలో ఏ ఊగిస‌లాట లేద‌ని చెప్పింది.

జెర్సీ సినిమా..క్రికెట్ నేప‌థ్యంగా సాగే మూవీ. త‌న కుమారిడి కోసం లేట్ వ‌య‌సులో క్రికెట్ జ‌ట్టులో చోటు సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నించే ఒక వ్య‌క్తి క‌థ‌. ఆయన కుమారుడు త‌న తండ్రిని ఏమి కోరుతాడు? ఎందుకు నాని లేట్ వ‌య‌సులో క్రికెట్ జ‌ట్టులో చోటు కోసం పోరాడుతాడు అనేది ఎమోష‌న‌ల్‌గా తీశాడ‌ట ద‌ర్వ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. ఈ సినిమాకి సంబంధించిన రెండు పాట‌లు ఇప్ప‌టికే మార్కెట్‌లోకి వ‌చ్చాయి. కోలీవుడ్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.