దేవ‌ర‌కొండ‌తో మూవీనా? అబ్బే నో!

Jhanvi says she's not offered Vijay Deverakonda's movie
Tuesday, October 2, 2018 - 19:30

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా స్థిర‌పడింది. ధ‌డ‌క్ ఆమె న‌టించిన తొలి చిత్రం. ఆమెని తెలుగులో కానీ, త‌మిళంలో కానీ న‌టింపచేయాల‌ని ప‌లువురు మేక‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఆమెని న‌టింపచేసేందుకు అంతా ఓకే అయింద‌ని ఇటీవ‌ల కొన్ని వెబ్‌సైట్లు వార్త‌లు ప్ర‌చురించాయి. వీటిపై జాన్వీ క‌పూర్ వివ‌ర‌ణ ఇచ్చింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌మూవీ ఆఫ‌ర్ ఎవ‌రూ తీసుకురాలేద‌ని క్లారిటీ ఇచ్చింది. ప్ర‌స్తుతానికి త‌న ఫోక‌స్ అంతా బాలీవుడ్ సినిమాల‌పైనే అని చెప్పింది. క‌ర‌ణ్ జోహ‌ర్ డైర‌క్ష‌న్‌లో కూడా ఆమె త్వ‌ర‌లోనే న‌టించ‌నుంది. ఆ సినిమా కోసం రెడీ అవుతోంది. బాలీవుడ్‌లో న‌టిగా బాగా పేరు తెచ్చుకున్న త‌ర్వాతే సౌత్‌పై లుక్కేస్తానంటోంది.