34లోకి కాజల్ ఎంట్రీ
నేడు కాజల్ పుట్టిన రోజు. ఆమె 34వ ఏట అడుగుపెడుతోంది. ఇప్పటికే ఆమె 12 ఏళ్ల కెరియర్‌ని పూర్తి చేసుకొంది. "లక్ష్మీకల్యాణం" సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన కాజల్ తాజాగా "సీత" సినిమాతో మరోసారి తేజ డైరక్షన్‌లో నటించింది. ఇపుడు ఆమె నిర్మాతగా మారుతోంది. తన గురువు తేజ డైరక్షన్‌లోనే తొలి సినిమాని నిర్మించనుందనేది టాక్. ఇప్పటికే ఈ భామ కె.ఎ. వెంచర్స్ పేరుతో ఒక బ్యానర్‌ని ఫ్లోట్ చేసింది.
కాజల్ ఒకపుడు పెద్దగా గ్లామర్ షో చేసేది కాదు. కానీ ఇపుడు రెచ్చిపోయి రచ్చ చేస్తోంది. 30 ప్లస్‌లో తెగ చూపిస్తోంది... అవకాశాల కోసమో, ట్రెండ్ ప్రకారమో. కారణమేదైనా కుర్రాళ్లు మాత్రం ఐఫీస్ట్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
కాజల్ త్వరలోనే "రణరంగం" అనే సినిమాతో మనల్ని మరోసారి పలకరించనుంది. ఈ సినిమాలో ఆమె శర్వానంద్ సరసన నటించింది. రణరంగంలో శర్వానంద్ మిడిల్ ఏజ్డ్ పాత్రలోనూ, యంగ్ క్యారక్టర్‌లోనూ కనిపిస్తాడు. మిడిల్ ఏజ్డ్ పోర్సన్స్‌కి సంబంధించిన సీన్లలో కాజల్ కనిపిస్తుంది. ఇక కమల్‌హాసన్ సరసన "భారతీయుడు 2" అంగీకరించింది. కానీ అది ఇప్పట్లో మొదలయ్యేలా లేదు.
- Log in to post comments