స‌న్నీని వ్య‌తిరేకిస్తున్న క‌న్న‌డిగులు

Kannada activists protest against Sunny Leone's film
Tuesday, October 9, 2018 - 13:00

స‌న్నీలియోన్ కోచ్చికి వ‌స్తే కేర‌ళ కుర్రాళ్ల అంతా ఆమెని చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. ఆమెకి రెడ్‌కార్పెట్ ప‌లికారు. కానీ క‌న్న‌డిగులు మాత్రం స‌న్నీలియ‌న్‌కి రెడ్‌కార్డ్ చూపిస్తున్నారు. ఆమెని వ్య‌తిరేకిస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో స‌న్నీలియోన్ చుట్టూ పెద్ద దుమారమే రేగుతోందిపుడు.

అస‌లు విష‌యం ఏంటంటే ఆమె నాలుగు భాష‌ల్లో ఒక మూవీ చేసింది. దాని పేరు "వీరమహాదేవి". తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఐతే క‌ర్ణాట‌క‌కి చెందిన వీరమహాదేవి పాత్రలో సన్నీలియోన్‌ని ఊహించ‌కోలేక‌పోతున్నారు క‌న్న‌డిగులు. అందుకే ఆ సినిమాని క‌ర్ణాట‌క‌లో ప్ర‌ద‌ర్శించొద్ద‌ని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాని విడుద‌ల కాకుండా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నాయి ఆ సంఘాలు. 

స‌న్నీలియోన్‌కి క‌ర్ణాట‌క‌లో చేదు అనుభ‌వం ఎదురుకావ‌డం ఇది రెండోసారి. గ‌తేడాది కొత్త ఏడాది వేడుకల కోసం ఆమెని బెంగుళూర్‌కి ఆహ్వానించింది ఒక సంస్థ‌. భారీ పారితోషికం సమర్పించుకొంది ఆమెకి. ఐతే క‌న్న‌డ సంఘాలు అపుడు ఆమె షోని వ్య‌తిరేకించడంతో ఆ షో ర‌ద్ద‌యింది. ఇపుడు సినిమాని బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి క‌న్న‌డ సంఘాలు.