మాట మార్చిన మంచు మనోజ్

Manchu Manoj goof ups with his tweets
Wednesday, June 14, 2017 - 15:15

ఉదయాన్నే లేచిన వెంటనే తెలుగు ప్రేక్షకులకు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు మంచు మ‌నోజ్‌. సినిమాల్లో ఇక న‌టించ‌ను అని  మంచు మనోజ్ ప్రకటించాడు.  ప్రస్తుతం చేస్తున్న 'ఒక్కడు మిగిలాడు' ప్రాజెక్టుతో పాటు సెట్స్ పై ఉన్న మరో ప్రాజెక్టు మాత్రమే తన ఆఖరి సినిమాలని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇంత సడెన్ గా మంచు మనోజ్ ఎందుకింత నిర్ణయం తీసుకున్నాడు అని జ‌నం అంతా గింజుకుంటున్న కొద్దిసేప‌టికే త‌న ట్వీట్‌ని డిలీట్ చేశాడు. 

దాంతో ఇదేదో సెల‌బ్రిటీ ట్వీట్ల గూఫ‌ప్‌ అని అంద‌రికీ అర్థ‌మైంది. దానికి బ‌లాన్ని ఇస్తూ ఇంకో ట్వీట్ వేశాడు. "నా రెండో సినిమా గురించి వెరైటీగా ట్వీట్ చేద్దామ‌నుకుంటే ఏదో తేడా కొట్టేసిన‌ట్లుందే..." అన్న అర్థంలో వివ‌ర‌ణ ఇచ్చాడు. అయితే మంచు మ‌నోజ్ ట్వీట్ల గూఫ‌ప్ (కంగాలీ వ్య‌వ‌హారం) వెనుక అర్థాలు ఇవీ అని సోష‌ల్ మీడియాలో డిస్కో షురూ అయింది.

నిద్ర‌మ‌త్తులో ఏదో ట్వీట్ వేయాల‌నుకొని ఇలా చేసి ఉంటాడ‌ని, దాన్ని క‌ప్పి పుచ్చేందుకు ఇలా క‌వ‌ర్ డ్రైవ్‌లు షురూ చేశాడ‌ని సోష‌ల్ మీడియాలో ట్రాలింగ్ మొద‌లైంది. మ‌రికొంద‌రు ఏమో మ‌నోజ్ తండ్రి, డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబ ఫోన్ చేసి బాగా "హిత‌బోధ" చేసి ఉంటాడ‌నే సెటైర్‌లు కూడా వేస్తున్నారు.