నారా భువ‌నేశ్వ‌రిగా మాంజిమా మోహ‌న్‌

Manjima Mohan to play Nara Bhuvaneshwari?
Tuesday, August 14, 2018 - 10:30

ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడు పాత్ర‌ని రానా పోషిస్తున్నాడ‌నేది పాత వార్తే. ఇప్ప‌టికే నారా షూటింగ్ షురూ చేశాడు. మ‌రి నారా ఉన్న‌ప్పుడు భువ‌నేశ్వ‌రి కూడా ఉండాలి క‌దా. ఎన్టీఆర్ కూతురు భువ‌నేశ్వ‌రిని పెళ్లాడిన త‌ర్వాతే నారా చంద్ర‌బాబునాయుడికి గుర్తింపు వ‌చ్చింది. అందుకే భువ‌నేశ్వ‌రి పాత్ర‌కి కూడా ఈ సినిమాలో ప్రాధాన్యం ఉంది. భువ‌నేశ్వ‌రి పాత్ర‌కి మ‌ల‌యాళ న‌టి మాంజిమా మోహ‌న్‌ని ఫైన‌లైజ్ చేశార‌ట‌.

మాంజిమా మోహ‌న్ తెలుగులో నాగ చైత‌న్య స‌ర‌స‌న సాహ‌సం శ్వాస‌గా సాగిపో అనే సినిమాలో న‌టించింది. అది అప‌జ‌యం పాలు కావ‌డం, ఆమె బాగా బొద్దుగా ఉండ‌డంతో తెలుగులో అవ‌కాశాలు రాలేదు. త‌మిళంలో ఒక‌టో, రెండో సినిమాలు చేసింది. మాంజిమాని భువ‌నేశ్వ‌రి పాత్ర‌కి ద‌ర్శ‌కుడు క్రిష్ ఫైన‌లైజ్ చేశాడ‌ట‌.

మాంజిమా త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని ఇంకా అప్‌డేట్ చేయ‌లేదు. ఐతే పాత అధ్యాయాల‌కి నా క‌ళ్ల‌ను మూస్తున్నా... కొత్త ప్రారంభాల‌కి హృద‌యాన్ని తెరుస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది.