నిఖిల్ స్లో అండ్ స్టడీ!
Submitted by tc editor on Mon, 2019-01-14 14:17
Mudra to release in Feb
Sunday, January 13, 2019 - 14:15
నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ముద్ర. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివరిదశలో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెలలో పూర్తి చేయనున్నారు.
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్స్ కూడా ఉన్నాయి.. దాంతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి.. అందుకే కాస్త సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు యూనిట్. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు నిఖిల్. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే టీజర్ విడుదల కానుంది.
- Log in to post comments