ఎన్.శంకర్ స్టూడియోకి 5 ఎకరాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి స్టూడియో కట్టేందుకు స్థలం పొందిన మొదటి ఫిల్మ్‌మేకర్...ఎన్.శంకర్. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో స్టూడియోల కోసం స్థలం తీసుకున్నవారంతా ఆంధ్రప్రాంతానికి చెందిన నిర్మాతలే. అలాగే వారికి 70, 80, 90లలో స్థలాలు ఇచ్చారు. అపుడు ఇప్పటి రేంజ్‌లో ధరలు లేవు. ఇపుడు దర్శకుడు ఎన్.శంకర్‌కి ఐదు ఎకరాల స్థలం అంద చేసింది తెలంగాణ ప్రభుత్వం.
స్టుడియో కడుతాననీ, స్థలం కావాలని శంకర్ ఎప్పటినుంచో కోరుతున్నారు. దాంతో తెలంగాణ మంత్రివర్గం తాజాగా స్థలం మంజూరు చేసింది. శంకర్‌పల్లి సమీపంలో ఐదెకరాల స్థలం ఎకరాకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. శంకర్‌పల్లిలో ప్రస్తుతం ఎకరం రెండు కోట్ల రూపాయల ధర పలుకుతోంది.
తెలంగాణ ఉద్యమంలో ఎన్.శంకర్ చురుగ్గా పాల్గొన్నారు. జైబోలో తెలంగాణ అనే సినిమాని కూడా తీశారు.
- Log in to post comments