తొలి సినిమాకి ముందే క‌నిక‌ట్టు!

Nabha Natesh is attracting all with her glam show
Tuesday, September 18, 2018 - 00:30

టాలీవుడ్‌లో క‌న్న‌డ భామ‌లు ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. బెంగుళూర్ బ్యూటీ పూజా హెగ్డే అగ్ర‌హీరోయిన్‌గా ఎదిగింది. కుర్ర‌కారుకి మైసూరు సుంద‌రి ర‌ష్మిక‌ అలా ప‌ట్టేసింది. ఇక ఇపుడు చిక్‌మ‌గుళూర్ చిన్న‌ది న‌భా న‌తేష్ కూడా క‌నిక‌ట్టు చేస్తోంది.

ఆమె న‌టించిన రెండు తెలుగు సినిమాలు విడుద‌ల‌కి రెడీగా ఉంది. ఒక‌టి "న‌న్ను దోచుకుందువ‌టే", మ‌రోటి "అదిగో". ఇందులో "న‌న్ను దోచుకుందువ‌టే" సినిమానే ఆమెకి తొలి చిత్రం, అదే కీల‌క‌మూ. సుధీర్‌బాబు హీరోగా న‌టించిన న‌న్ను దోచుకుందువంటేలో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ పాత్ర పోషించింది. సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ మూవీ. ఇక ఈ సినిమా విడుద‌ల‌కి ముందే ఆమె అందచందాల షో బాగా చేస్తోంది. ఈవెంట్స్‌కి వ‌చ్చిన‌పుడు ఆమె సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ అవుతోంది.

ఇటీవ‌ల సైమా అవార్డ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా కూడా న‌భా న‌తేష్ చేసిన గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. మ‌రి ఈ అందాల సుంద‌రి కూడా ర‌ష్మిక‌లా పాపుల‌ర్ అవుతుందా అనేది చూడాలి.