చైతూసామ్‌ల రిసెప్ష‌న్‌ డేట్ ఫిక్స్ అయింద‌ట‌!

Naga Chaitanya and Samantha's wedding reception on Nov 12?
Wednesday, November 1, 2017 - 22:45

పెళ్లి అయి దాదాపు నెల రోజుల‌వుతోంది. కొత్త జంట చైత‌న్య‌, స‌మంత ఇపుడు హనీమూన్ టూర్‌లో ఉన్నారు. స్కాట్లాండ్‌కి వెళ్లింది ఈ జంట‌. పెళ్ల‌యిన నెలన్న‌ర రోజుల త‌ర్వాత వీరికి రిసెప్స‌న్ ఏర్పాటు చేసే ప‌నుల్లో ఉన్నాడు అక్కినేని నాగార్జున‌. 

నవంబర్ 12న వీరి రిసెప్స‌న్ జ‌రుగుతుంద‌ట‌. పెళ్లికి బంధు మిత్రుల‌ను త‌ప్ప ఇత‌రుల‌కి ఆహ్వానం ద‌క్క‌లేదు. అందుకే టాలీవుడ్‌లోని సెల‌బ్రిటీలంద‌రికీ, తెలుగునాట ఉన్న రాజ‌కీయ‌, వ్యాపార‌, ఇత‌ర ప్ర‌ముఖులంద‌రి కోసం ఈ వెడ్డింగ్ రిసెప్స‌న్‌ని ఏర్పాటు చేస్తున్నాడు నాగ్‌. పెళ్లికి ఎవ‌ర్నీ పిల‌వ‌క‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల కామెంట్స్ వినిపించాయి. దాంతో నాగ్ ఇపుడు ఈ వెడ్డింగ్ రిసెప్స‌న్‌ని గ్రాండ్‌గా కండ‌క్ట్ చేయ‌నున్నాడు. పెళ్ల‌యిన ఇంత గ్యాప్ త‌ర్వాత రిసెప్స‌న్ అనేది వెరైటీ. 

నాగార్జున‌కి చెందిన ఎన్ క‌న్వెన్స‌న్ సెంట‌ర్‌లోనే ఈ ఫంక్ష‌న్ ఉంటుంద‌ట‌. వీరి పెళ్లి అక్టోబ‌ర్ 6,7 తేదీల్లో జ‌రిగింది. ఆరో తేదీన హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం జ‌రిగితే, ఏడున క్రిస్టియ‌న్ స్ట‌యిల్‌లో జ‌రుపుకున్నారు. గోవాలోని డ‌బ్య్లూ అనే రిసార్ట్‌లో పెళ్లి వేడుక జ‌రిగింది.