ఆమెకి ఆయ‌న‌ ప్రియుడా? భ‌ర్తా?

Nayanthara and Vignesh pose for Deepavali celebrations
Wednesday, November 7, 2018 - 17:15

న‌య‌న‌తార‌కి పెళ్లి కాలేద‌ని మ‌నంద‌రికీ తెలుసు. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఒక గుస గుస ఎపుడూ వినిపిస్తూనే ఉంటుంది. అదే న‌య‌న‌తార‌కి ఆల్రెడీ పెళ్ల‌యిపోయింద‌ని, కానీ ఆ విష‌యాన్ని ఆమె చెప్ప‌డం లేద‌నేది ఆ గాసిప్‌. యువ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌తో ఆమె క‌లిసే జీవిస్తోంది. మా ఇద్ద‌రికీ నిశ్చితార్థం జ‌రిగింద‌న్న‌ట్లుగా ఆ మ‌ధ్య న‌య‌న‌తార ఒక మాట చెప్పింది. ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌పంచం అంతా తిరుగుతున్నారు.

ఇక తాజాగా దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా న‌య‌న‌తార మిత్రులంతా క‌లిసి పార్టీ చేసుకున్నారు. ఆ త‌ర్వాత గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు తీసుకునే టైమ్‌లో న‌య‌న‌తార విగ్నేష్‌ని ద‌గ్గ‌రికి మరీ లాక్కొని ఫోజులు ఇవ్వ‌డం, వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త‌ని చూసిన వారంతా వారు భార్యాభ‌ర్త‌ల్లానే ఉన్నార‌ని అంటున్నారు.

ఏ ఫోటోల్లోనూ విగ్నేష్‌ని వ‌ద‌ల‌దు న‌య‌న‌తార‌. ఆయ‌న అంత ప్రేమంట‌. ఆమె కోలీవుడ్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది. ఈ టైమ్‌లో పెళ్లి అయింద‌ని అంటే కెరియ‌ర్‌కి ఇబ్బందని న‌య‌న ఆలోచిస్తున్న‌ట్లుంది.