క్రిస్మస్‌కి ముహూర్తం! నిజమేనా?

నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోలేదన్న మాటే తప్ప వారిద్దరూ భార్యభర్తల్లానే ఉంటున్నారు రెండేళ్లుగా. వెకేషన్లు, ఫంక్షన్లు అన్నీ కపుల్స్‌లాగే చేస్తున్నారు. కానీ పెళ్లి అనే ఒక లీగల్ ముద్ర పడలేదు అంతే.
ఏడాదిన్నరగా వీరి పెళ్లి అదిగో, అదిగో అంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఐతే నయనతార ఈ నవంబర్‌లో 35లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంటే ఆమె పిల్లల్ని కనాలంటే...ఎక్కవ టైమ్ లేదు. బయలాజికల్ క్లాక్ తిరుగుతోంది. అందుకే ఇక పెళ్లి చేసుకోక తప్పదు అనే టాక్ నడుస్తోంది. అందుకే ఈ డిసెంబర్ 25న వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందనేది కొత్త టాక్. ఇందులో నిజమెంతో?
విగ్నేష్ తమిళ కుర్రాడు. నయనతార కేరళ కుట్టి. అతను దర్శకుడు. ఆమె హీరోయిన్. ఐతే ఇద్దరూ కలిసి ఇటీవలే ఒక ప్రొడక్షన్ బ్యానర్ మొదలుపెట్టారు. ఆ బ్యానర్‌పై తీస్తున్న మొదటి సినిమాలో నయనతారే హీరోయిన్. అన్ని విధాల వారు పార్ట్‌నర్స్‌గానే మెలుగుతున్నారు. ఇక లీగల్‌గా లైఫ్ పార్ట్‌నర్స్ కావడమే మిగలి ఉంది.
- Log in to post comments