పెళ్లి పోస్ట్‌పోన్ చేసిన నీహారిక‌

Niharika has no plans of getting married anytime soon
Wednesday, July 18, 2018 - 19:15

నీహారిక కొణిదెల ఆ మ‌ధ్య ఒక హీరోని పెళ్లి చేసుకోవాల‌నుకుంది. కానీ ఇపుడు ఆమె ఆలోచ‌న డ్రాప్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఏమైందో ఏమో కానీ.. ఇద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ అయింది (ట‌). అందుకే ఆమె ఎడాపెడా కొత్త‌గా సినిమాలు ఒప్పుకుంటోంది. త్వ‌ర‌లోనే హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా రిలీజ్ అవుతోంది.

రీసెంట్‌గా శ్రియాతో క‌లిసి ఒక సినిమా లాంచ్ చేసింది. అందులో ఆమె రెండో హీరోయిన్‌. అలాగే ముద్ద‌ప‌ప్పు వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడు తీస్తున్న తొలి చిత్రంలోనూ ఆమే క‌థానాయిక‌. అంటే చేతిలో హీరోయిన్‌గా రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

ఇంకా మ‌రిన్ని ఆఫ‌ర్లు కావాల‌ని కోరుకుంటోంది. ఆమె తాజాగా ఒక ఫోటోసూట్ చేయించుకొంది. ట్రెండీగా క‌నిపించింది ఈ కొత్త షూట్లో. అంటే హీరోయిన్ పాత్ర‌లు కావాల‌ని ఆమె ఇన్‌డైర‌క్ట్‌గా చెపుతోంది. ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న లేన‌ట్లే. పెళ్లి మాట‌ని పోస్ట్‌పోన్ చేసింది నీహారిక‌.

నాగ‌బాబు కూతురు..నీహారిక‌. తెలుగులో ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. త‌మిళంలోనూ ఒక మూవీ చేసింది. రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టాయి.