సూర్య‌కాంతంగా నీహారిక‌

Niharika Konidela's film titled Suryakantham?
Monday, November 5, 2018 - 20:00

నాగబాబు కూతురు నీహారిక బుల్లితెర‌పై, వెబ్‌తెర‌పై స‌క్సెస్ అయింది. కానీ వెండితెర‌పై ఆమెకి ల‌క్ క‌లిసిరావ‌డం లేదు. టీవీ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకొంది. "ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ" అనే పేరుతో యూట్యూబ్‌, వెబ్ సిరీస్‌లు కూడా చేసి ..యూత్‌ని అట్రాక్ట్ చేసింది. కానీ అదేంటో..హీరోయిన్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన ఏ మూవీ కూడా ఆడలేదు..

ఐనా నిరాశ‌చెంద‌డం లేదు. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కినిలా మారింది. ప్ర‌స్తుతం క్రిష్ నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తోంది. దాంతో పాటు "ముద్దప‌ప్పు" వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడు ప్రనీత్  తీస్తున్న తొలి చిత్రంలోనూ న‌టిస్తోంది. నిర్వాణ సినిమాస్ అనే ఓవ‌ర్సీస్ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరో.

అన్న‌ట్లు ఈ సినిమాకి "సూర్య‌కాంతం" అనే పేరుని ఫిక్స్ చేశార‌ట‌.

మెగాస్టార్ కుటుంబం నుంచి ప‌లువురు హీరోలుగా ప‌రిచ‌యం అయ్యారు, స‌క్సెస్ అయ్యారు. కానీ న‌టిగా ప‌రిచ‌య‌మైన ఈ  అమ్మాయి స‌క్సెస్ కాలేక‌పోతోంది హీరోయిన్‌గా. మ‌రి ఈసారి అయినా నిహారిక నిల‌బ‌డుతుందా?