జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌కి కండ‌ల షో ఎందుకు?

Nikhil Siddharth showing off muscles!
Friday, October 12, 2018 - 15:45

నిఖిల్ ఈ మ‌ధ్య త‌న బేర్ బాడీని తెగ చూపిస్తున్నాడు సోష‌ల్ మీడియాలో స‌ల్మాన్‌ఖాన్‌లా. కండ‌లు పెంచాడు. సిక్స్‌ప్యాక్‌లాంటి బాడీ తీర్చిదిద్దుకున్నాడు. తాజాగా ఇంకో ఫోటో వ‌చ్చింది. ఇందులో నిఖిల్ టైగ‌ర్ ష్రాప్‌లా కండ‌లు చూపిస్తున్నాడు. త‌ప్పేముంది అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఆయ‌న ఇదంతా చేస్తున్న‌ది, చూపిస్తున్న‌ది ఒక జ‌ర్న‌లిస్ట్ పాత్ర కోసం.

క‌నిత‌న్ అనే త‌మిళంలో హిట్ట‌యిన సినిమాని తెలుగులో అదే త‌మిళ ద‌ర్శ‌కుడు ముద్ర పేరుతో రీమేక్ చేస్తున్నాడు. త‌మిళంలో అధర్వ ముర‌ళి పోషించిన పాత్ర‌ని తెలుగులో నిఖిల్ చేస్తున్నాడు. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌కి ఈ కండ‌లు అవ‌స‌ర‌మా? ఈ సినిమాని నవంబ‌ర్‌లోనే విడుద‌ల చేస్తార‌ట‌. అందుకే రిలీజ్ కోసం ఒకేసారి డ‌బ్బింగ్ ప‌నులు, క్ల‌యిమాక్స్ చిత్రీక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయ‌ట‌.