నితిన్ ల‌వ్ మీట‌ర్ తిరిగిందా?

Is Nithin really dating that heroine?
Tuesday, September 12, 2017 - 21:15

నితిన్ ఇపుడు అమెరికాలో ఉన్నాడు. ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య తీస్తున్న కొత్త సినిమాలో న‌టిస్తున్నాడు. మంచి క‌థ‌తో రూపాందుతోంది ఈ మూవీ. "గుర్తుందా శీతాకాలం" అనే రొమాంటిక్‌ పేరుని కూడా ప‌రిశీలిస్తున్నారు ఈ మూవీకి. అయితే ఇపుడు మేట‌ర్ దాని గురించి కాదు నితిన్ ల‌వ్ మీట‌ర్ గురించి. 

అవును.. ల‌వ‌ర్‌బాయ్ నితిన్ రియ‌ల్‌లైఫ్‌లో డేటింగ్ షురూ చేశాడ‌ని వెబ్‌లోకంలో వార్త వ‌చ్చింది. షికారు చేస్తున్నఈ వార్త పుకారా? నిజ‌మా అన్న‌ది ఇపుడే చెప్ప‌లేం. ఈ మ‌ధ్య ఏది వైర‌లో ఏదో రియ‌లో తెలియ‌ని విధంగా యూట్యూబ్ వార్త‌లు జ‌నాల‌కి షాక్‌లిస్తున్నాయి. 

నితిన్ న‌టించిన "లై" సినిమాతో మేఘా ఆకాశ్ అనే త‌మిళ పొన్ను తెలుగుకి ప‌రిచయం అయింది. "లై" సినిమా వ‌ల్ల నిర్మాత‌ల‌కి ఏ లాభం క‌ల‌గ‌క‌పోయినా నితిన్‌కి రియ‌ల్ లైఫ్‌లో ప్రేమ ప్రాఫిట్ ద‌క్కింద‌నేది ఈ వార్త‌ల సారంశం. నితిన్ మ‌ళ్లీ అదే భామ‌తో ఇపుడు సినిమా చేస్తున్నాడు.  కృష్ణ చైత‌న్య - నితిన్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ మూవీలో మేఘా ఆకాష్ హీరోయిన్. అయితే వ‌రుస‌గా రెండు సినిమాలు చేస్తున్నాడంటే ఏదో ఉండి ఉంటుందిలే అని అల్లిన వార్త‌నా? లేక "అల్లిబిల్లి క‌ల‌లా" అని నిజంగానే వీరు రియ‌ల్‌లైఫ్‌లో పాట పాడుకుంటున్నారా అన్న‌ది ఈ సినిమా ప్ర‌మోష‌న్ టైమ్‌లో తేలుతుంది. అపుడు మీడియా నితిన్‌ని ఈ మేట‌ర్ అడ‌గ‌కుండా ఉండ‌దు....నితిన్ స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకోలేడు క‌దా. సో లెట్స్ వెయిట్‌!