రంగ్ దేకి అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్

Nithin's Rang De begins music sittings
Monday, August 26, 2019 - 22:45

నితిన్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ఇప్పటికే సితార ఎంటర్ టెన్న్మెంట్స్ బ్యానర్ పై 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ జోరుగా సాగుతోంది. దానికితోడు, చంద్రశేఖర్ యేలేటి కూడా ఒక మూవీ షూటింగ్ మొదలుపెట్టాడు. ఆ సినిమాలో కూడా హీరో నితిన్. ఇలా రెండు సినిమాలు సెట్ పై ఉండగానే, ఇంకో సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేసింది. ఏమిటి ఈ స్పీడు!!

తొలిప్రేమ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ...నితిన్, కీర్తి సురేష్ జంటగా 'రంగ్ దే' అనే సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ అయ్యాయి. అంటే దూకుడు మామూలుగా లేదు. వచ్చే వేసవి కి సినిమాని రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. 

'రంగ్ దే' సినిమాకి పీసీ శ్రీరామ్ కెమెరామన్.