ఐర‌న్‌లేడీ జ‌య‌ల‌లిత‌గా నిత్య‌మీన‌న్‌

Nithya Menen to play Jayalalithaa in The Iron Lady
Sunday, September 23, 2018 - 11:15

త‌మిళ‌నాట కూడా బ‌యోపిక్‌ల ఫీవ‌ర్ ప‌ట్టుకొంది. ఐతే అక్క‌డ వెరైటీ ఏంటంటే ఒక వ్య‌క్తి బ‌యోపిక్‌ని న‌లుగురు ఫిల్మ్‌మేక‌ర్స్ తీస్తున్నారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని ఇప్ప‌టికే ప‌లువురు ఫిల్మ్‌మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అందులో ముందుగా ప్రారంభం అవుతున్న మూవీ.."ది ఐర‌న్ లేడీ". 

ఏ.ప్రియ‌ద‌ర్శిని అనే యువ ద‌ర్శ‌కురాలు రూపొందిస్తున్న ఈ మూవీలో నిత్య మీన‌న్ జ‌య‌ల‌లిత‌గా న‌టించ‌నుంది. ద‌ర్శ‌కురాలు ప్రియ‌ద‌ర్శిని తాజాగా నిత్య‌మీన‌న్ పేరుని అధికారికంగా ప్ర‌క‌టించింది. "త‌మిళ‌నాడులో ఇపుడున్న రాజ‌కీయ అనిశ్చితి, ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌య‌ల‌లిత పాత్ర పోషించేందుకు ఏ న‌టి ముందుకు రాలేదు. కానీ నిత్య మీన‌న్ త‌న డేరింగ్ ప‌ర్స‌నాలిటీని మ‌రోసారి చూపింది. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించేందుకు కూడా చాలా మంది న‌టులు జంకుతున్నారు. జ‌య‌ల‌లిత వ‌య‌సుకి వ‌చ్చినప్ప‌టి నుంచి ఆమె చ‌నిపోయిన వ‌ర‌కు జ‌రిగిన అన్ని సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ బ‌యోపిక్‌ని తీస్తున్నామ‌,"ని డైర‌క్ట‌ర్ చెప్పింది.

త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌.విజ‌య్ కూడా ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని అనౌన్స్ చేశాడు. గ్రేట్ డైర‌క్ట‌ర్ భార‌తీరాజా కూడా అమ్మ సినిమాని తీస్తున్నా అని చెప్పాడు.