జగన్‌పై పవన్ కల్యాన్ గన్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. రాయలసీమ టూర్ మొదలుపెట్టాడు. కర్నూల్‌లో రోడ్‌షో నిర్వహించారు. జనసేనాని వామపక్షాలు మినహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనని చెపుతున్నారు. ఐతే పవన్ కల్యాణ్ - తెలుగుదేశం పార్టీతో అనధికార పొత్తు పెట్టుకున్నారని వైఎస్సార్సీ పార్టీ ఆరోపిస్తోంది. దాంతో జగన్‌పై మాటల గన్ పేల్చాడు పవర్‌స్టార్. రెడ్డి అంటే జనాలని కాపాడేవాడు అని అర్థం, జనం సొమ్ము దోచుకునేవాడు కాదంటూ జగన్ మోహన్‌రెడ్డిపై మాటల తూటాలు సంధించాడు పవర్‌స్టార్.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌తోనే తమ పార్టీ పోటీ అని చెప్పకనే చెపుతున్నాడు జనసేనాని. రాయలసీమలో ఇంతవరకు పవర్‌స్టార్ పెద్దగా తిరగలేదు. అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో టూర్ వేయలేదు. కర్నూలు రోడ్‌షోతో అది మొదలుపెట్టాడు.
- Log in to post comments