కాశీకి పోతాను రామా హరి!

పవన్ కల్యాణ్ యూరోప్ నుంచి వచ్చి రాగానే తన జనసేన పార్టీ నేతలతో కలిసి ముచ్చటించారు. లండన్‌లో గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం, అక్కడ ప్రముఖులు తన ఆలోచనలను, సైద్దాంతికతకి మద్దతు తెలపడం గురించి జనసేనాని వారికి వివరించారు. ప్రస్తుతం జనసేన పార్టీపై పూర్తిగా ఫోకస్ నిలిపారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగానే పవన్ జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెడుతారు.
వచ్చే నెలలో ఈ సినిమాకి (అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉంది) గుమ్మడికాయ కొడుతారు. ఐదు రోజుల పాటు హైదారాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసి, మిగతా భాగాన్ని కాశీ (వారణాశి)లో తీస్తారు. సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలను కాశీనాథుని సన్నిధిలో, గంగాతీరంలో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత మిగిలిన ప్యాచ్‌వర్క్‌ని హైదరాబాద్‌లో తీస్తారు. డిసెంబర్ మిడిల్‌కి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.
త్రివిక్రమ్ తీస్తున్న ఈ ఫ్యామిలీ రొమాంటిక్ మూవీ ఆడియో ఈవెంట్ లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని డిసెంబర్ మూడోవారంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో టైటిల్ ప్రకటన, టీజర్, ఇతర సాంగ్స్ విడుదల.. ఇలా వరుసగా ప్రమోషనల్ హంగామా ఉంటుంది.
సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇన్‌సైడ్ టాక్ కూడా అదుర్స్ అన్నట్లుగా ఉంది. మరో రికార్డు బ్రేకింగ్ హిట్ అవడం గ్యారెంటీ అంటున్నారు.
- Log in to post comments