ఆమె అందమే ఆర్‌డిఎక్సా

Payal Rajput in RDX Love
Monday, August 19, 2019 - 17:30

ఆర్‌డిఎక్స్‌ బాంబు అత్యంత పవర్‌ఫుల్‌. పేలితే.. అంతా మటాషే. ఇపుడు అందానికి ఆ పేరు వాడుతున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో అందాలన్నీ ఆరబోసింది పాయల్‌ రాజ్‌పుత్‌. మంచి "సీన్ల'లలో కూడా నటించింది. ఆ ఒక్క సినిమాతో పాయల్‌ ఎక్కడికో పోతుందనుకున్నాం. కానీ ఆమె క్రేజ్‌ అంతగా పనికి రాలేదు. ఆ మధ్య ఓ సినిమాలో ఐటెంసాంగ్‌ చేసినా..అది పేలలేదు. ఐతే ఈ సారి ఆర్‌డిఎక్స్‌ అందాలతో పేల్చాలని ప్రయత్నిస్తోంది.

ఆమె నటిస్తున్న కొత్త చిత్రం..ఆర్‌డిఎక్స్‌ లవ్‌.   ఈ సినిమాలో హీరోకి పెద్దగా పేరు లేదు. అందుకే ఆమె అందాన్నే ఎరగా వేస్తున్నారు సినిమా స్టిల్స్‌లో. పాయల్‌ రాజ్‌పుత్‌ నాభి ప్రదర్శనతో కూడిన ఫోటోలను తెగ వదులుతోంది టీమ్‌. మరి కుర్రకారు ఆర్‌ఎక్స్‌100 సినిమాని చూసేందుకు విరగబడ్డట్లు ఈ సినిమాకి కూడా వస్తారా అనేది చూడాలి.