మహేష్ ఇంకా ఓకే అనలేదు

'డీజే'లో చూపించిన అందాలు పూజా హెగ్డేకు టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి. ఎందుకంటే గత రెండు సినిమాల్లో ఆమె గ్లామర్ షో చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎట్టకేలకు డీజేతో ఆ అవకాశం రావడంతో దాన్ని ఫుల్లుగా వాడేసుకుంది పూజా. పనిలోపనిగా బికినీ కూడా వేసింది. ఈ గ్లామర్ షో వల్ల ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.
మహేష్ బాబు సినిమాలో పూజా హెగ్డే కు హీరోయిన్ ఆఫర్ వచ్చిందని ఇటీవల మీడియా కోడై కూసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 25వ సినిమాను చేయాలని మహేష్ బాబు ఫిక్స్ అయ్యాడు. దిల్‌రాజు, అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ మూవీలోనే పూజాను హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. నిర్మాత కూడా దిల్ రాజే కావడంతో ఈ వార్తలకి బలం చేకూరింది. అయితే మహేష్‌బాబు మాత్రం ఇంకా ఓకే చెప్పలేదట.
అటు "స్పైడర్", ఇటు "భరత్ అనే నేను" సినిమాలు పూర్తి కాకముందే పైడిపల్లి సినిమా గురించి చర్చ ఎందుకు అని మహేష్‌బాబు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. పైడిపల్లి, దిల్‌రాజు ఆలోచన ప్రకారం పూజా హెగ్డేని తీసుకోవాలని ఉన్నా... ఫైనల్ నిర్ణయం మాత్రం మహేష్‌దే అవుతుంది. ఆయన ఎస్ అంటేనే పూజాకి ఈ బడా ఛాన్స్ దక్కుతుంది. అయితే మహేష్‌బాబు హీరోయిన్ల సెలక్షన్ల విషయంలో దర్శక, నిర్మాతల ఆలోచనకే ప్రాధాన్యం ఇస్తాడనే టాక్ ఉంది. "వన్ నేనొక్కడినే"లో క్రితి సనోన్ సెలక్షన్‌కైనా, తాజాగా "భరత్ అనే నేను" సినిమాలో బాలీవుడ్ వర్ధమాన తార కైరా సెలక్షన్‌కైనా ఆయన అభ్యంతరం తెలపలేదు. సో.. ఆ లెక్కన పూజాకి చాన్స్ ఉంది.
- Log in to post comments