లోకేష్‌పై పోసాని ఫైర్, నంది వాపసు

నంది అవార్డుల వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. ప్రముఖ నటుడు, రచయిత తనకి వచ్చిన నందిని వాపసు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. టెంపర్ సినిమాలో నటనకిగాను ఆయనకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. అయితే తాను కమ్మవాడిని కాబట్టే ఈ అవార్డు ఇచ్చారని అందరూ అంటున్నారని, ఇది నాకు సిగ్గుచేటు అని మండిపడ్డారు పోసాని. ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల నంది అవార్డుల ప్రతిష్ట మసకబారిందని అన్నారు పోసాని.
నంది అవార్డులపై విమర్శలు చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలతో రగడ మరింత ముదిరింది. ఏపీలో ఆధార్ కార్డు, ఓటరు ఐడీ లేని వాళ్ళు కూడా విమర్శిస్తారా అంటూ లోకేష్ అనడంతో పోసాని ఈ అవార్డును వాపసు ఇస్తున్నట్లు ప్రకటించారు. విమర్శించడానికి ఆధార్, ఓటరు కార్డు కావాలా అంటూ పోసాని విరుచుకుపడ్డారు. నాన్ ఏపీ వాళ్లను నంది జ్యూరీలో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు పోసాని.
పోసాని ప్రెస్‌మీట్‌లోని కొన్ని ప్రశ్నలు..పాయింట్స్...
- విమర్మించడానికి ఆధార్ , ఓటరు కార్డు కావాలా?
- నంది అవార్డులకు, నాన్ రెసిడెన్సీకి సంబంధం ఏంటి?
- లోకేశ్ లాంటి వాడు మంత్రి అవడం మా కర్మ. పంతులనిపెట్టి పాఠాలు నేర్చుకో లోకేశ్ బాబు. మమ్మల్ని ఆంధ్రా రోహింగ్యలను చేయవద్దు.
- అవార్డుల ఎంపికలో లోపాలున్నాయని సరిదిద్దుకోమని చెబితే నాన్ లోకల్ అంటున్నారు. నంది అవార్డులకే మమ్మల్ని నాన్ లోకల్ చేశారు
- నాకు నంది అవార్డు రావడం సిగ్గుగా ఉంది. ప్రస్తుత నంది అవార్డులను రద్దు చేయాలి. లేదంటే నేను చనిపోయే వరకు నంది ముట్టుకోను.
- లోకేశ్ బాబు నంది అవార్డు అని పెట్టుకొనిఇచ్చుకొండి
- మీకు తెలంగాణలో ఆస్తులు లేవా. ఇక్కడ పన్నులు కడుతూ విజయవాడలో రాజకీయం చేస్తారా
- కేసిఆర్ ఆంధ్రులను ఒక్క మాట అనలేదు
- Log in to post comments