పీకే25: దీపావ‌ళికి బ‌హుమ‌తి డౌటే!

PSPK25: No title announcement or teaser launch on Deepavali
Monday, October 16, 2017 - 11:15

ఈ దీపావ‌ళికి సినిమా టైటిల్‌తో కూడిన పోస్ట‌ర్ లేదా టీజ‌ర్ వ‌స్తుంద‌ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆశ‌ల మేడ‌లు క‌ట్టుకుంటున్నారు. దానికి త‌గ్గ‌ట్లే మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం దీపావ‌ళి పండక్కి అలాంటి బ‌హుమ‌తి ఏమీ రావ‌డం లేదు పీఎస్‌పీకే25 టీమ్ నుంచి. అన్ని కుదిరితే ఒక మేకింగ్ వీడియో కానీ షూటింగ్ ప్రొగ్రెస్ తెలియ‌చేసే వీడియో బైట్‌కానీ ఇవ్వొచ్చు.

టైటిల్ ప్ర‌క‌ట‌న‌కి, టైటిల్‌తో కూడిన మొద‌టి లుక్కు విడుద‌ల‌కి మ‌రికొంత టైమ్ తీసుకోవాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. అజ్ఞాత‌వాసి అనే పేరు ఇప్ప‌టికే మీడియాలో బాగా తిరుగుతోంది. నిర్మాత కూడా ఈ పేరుని ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేశారు. అయితే ఇదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా లేక మ‌రోటి ఆలోచించి అనౌన్స్ చేస్తారా అన్న విష‌యంలోనూ ఇంకా క్లారిటీ లేదు.

జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. చిక్‌మ‌గుళూర్‌లో షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ నెల చివ‌రి వారంలో టీమ్ అంతా యూరోప్ వెళ్ల‌నుంది. యూరోప్‌లో షూటింగ్ పూర్త‌యితే సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ దాదాపుగా చివ‌రి ద‌శ‌కి చేరుకున్న‌ట్లే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి 25వ చిత్రం. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ్మ‌గా కుష్బూ న‌టిస్తోంది. మ‌రో కీల‌క పాత్ర‌లో బొమాన్ ఇరానీ క‌నిపిస్తారు.