మాకే సినిమా చూపిస్తారా?

R Narayana Murthy says Tollywood is being targeted in drugs case
Monday, July 24, 2017 - 14:00

డ్ర‌గ్స్ కేసులో సినిమా తార‌ల‌ను గంట‌ల త‌ర‌బ‌డి విచారిస్తోంది సిట్ (స్పెష‌ల్ ఇన్విస్టిగేష‌న్ టీమ్‌). అయితే ఈ కేసులో కేవ‌లం సినిమా వారినే టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాంగోపాల్ వ‌ర్మ ఇప్ప‌టికే త‌ప్పు ప‌ట్టాడు. తాజాగా ఆర్‌.నార‌య‌ణ మూర్తి కూడా ఇదే అభిప్రాయం వెల్ల‌డించాడు. డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్నే లక్ష్యం చేయడం సరికాదన్నారు నారాయణమూర్తి.

సినిమాలు తీసే మాకే సినిమాలు చూపిస్తున్నార‌ని కౌంట‌ర్ వేశారు నారాయ‌ణ మూర్తి. 

షసిట్ అధికారులు, మీడియా.... సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారు. డ్రగ్స్‌ను కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమ కలిగిస్తున్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. పెద్దపెద్ద ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు. సినిమా పెద్ద పరిశ్రమ కావడం, గ్లామ‌ర్‌తో నిండిన‌ది కావ‌డంతో అందరూ మమ్మల్నే చూస్తున్నారు, అని నారాయణమూర్తి ఆక్షేపించారు.

డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.  మూలాలు వెతికి అరికట్టాలి. ముఖ్యంగా స్కూల్ పిల్ల‌ల‌ని కాపాడాలి. సినిమా వారినే టార్గెట్ చేయొద్ద‌ని విప్ల‌వ చిత్రాల క‌థానాయ‌కుడు ప్ర‌భుత్వాల‌కి సూచించారు.