నేను పుట్టింది విజయవాడలోనే: శర్వానంద్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`. ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమంలోశర్వానంద్, లావణ్య త్రిపాఠి, డా.రమేష్, డా.రామ్మోహన్‌రావు, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, క్రాంతిమాధవ్, మేర్లపాక గాంధీ, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, డైరెక్టర్ చంద్రమోహన్, కేశినేని నాని, దిల్‌రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు, అలంకార్ ప్రసాద్, సుద్శరన్ తదితరులు పాల్గొన్నారు.
"ఒక కృష్ణుడు పోలీస్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం. అప్పట్లో కృష్ణుడు చక్రం తిప్పితే, ఈ కృష్ణుడు లాఠీ తిప్పుతాడు. నా కుటుంబానికి, నా గురువు కరుణాకరణ్‌గారికి ధన్యవాదాలు. నిర్మాతలు బివిఎస్ఎన్, బాపినీడు ప్రారంభం నుండి ఎంతగానో సపోర్ట్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుంది" అన్నారు దర్శకుడు చంద్రమోహన్.
"విజయవాడ తెలుగు సినిమాకు పుట్టినిల్లు. ఎన్టీఆర్‌గారైనా, ఏఎన్నార్ అయినా ఎవరైనా ఇక్కడి నుండి వెళ్ళి ఇండస్ట్రీలో రాణించినవారే. ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పదేళ్ళుగా వరుస విజయాలు సాధిస్తున్న హీరో శర్వానంద్ ఎంతటి హార్డ్ వర్క్ చేసేవాడో దిల్‌రాజుగారు చెప్పారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని కుటుంబం నుండి వచ్చి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్‌కు ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నాను. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బాపినీడు సహా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్" కేశినేని నాని అన్నారు.
"మే 12న రాధ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. మా అబ్బాయి బాపినీడు నిర్మాతగా పూర్తి స్థాయిలో చేసిన సినిమా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు బివిఎస్ఎన్ ప్రసాద్.
``రాధ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాను. చంద్రమోహన్‌గారు చాలా జాగ్రత్తగా సినిమాను డైరెక్ట్ చేశారు. శర్వానంద్ స్వీటెస్ట్ హీరో. తనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. మంచి సినిమాను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` చెప్పింది హీరోయిన్ లావణ్య.
శర్వానంద్
``నేను పుట్టింది విజయవాడలోనే. నానిగారు చెప్పిననట్టు మా తాతగారు బొమ్మినేని సుబ్బారావుగారు సిద్ధార్థ్ ఎడ్యుకేషన్ అకాడమీలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే కాలేజ్‌లో నేను మాట్లాడటం ఆనందంగా ఉంది. పోలీసులకు ట్రిబ్యూట్ మూవీయే రాధ. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ, కృష్ణుడిలా ఉంటూ మెసేజ్ అంటూ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేసే చిత్రమవుతుంది. ఫ్యామిలీలందరూ కూర్చొని నవ్వుకునే సినిమా ఇది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అప్పుడు కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. పోలీసు వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసు. మనం ఏ ఆపదలో వున్న మనల్ని కాపాడేది పోలీసులే. వారు లేకుంటే మనం లేం. మనల్ని రక్షిస్తున్నారు. ఆ పాయింట్ నచ్చే సినిమా చేయడానికి అంగీకరించాను. ప్రసాద్‌గారు చాలా కూల్ ప్రొడ్యూసర్. చాలా మంచి హిట్ సినిమా ఇవ్వబోతున్నారు. బాపినీడు కథ నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు. చాలా మంచి సినిమా ఇస్తున్నాడు. రధన్ మంచి మ్యూజిక్‌తో చంపేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. డైరెక్టర్ చంద్రమోహన్ బిగ్ లీగ్ డైరెక్టర్ లిస్టులో ఉంటాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమా కథను రాయడమే కాకుండా చక్కగా తీశాడు. మే 12న విడుదలవుతున్నరాధ సినిమా ఎంటర్‌టైనింగ్ మూవీగా అందరికీ నచ్చుతుంది. అందరికీ థాంక్స్``
- Log in to post comments