టైసన్ రాహుల్ కు మంచి పేరు

Rahul gets good name with Venkatapuram
Friday, May 12, 2017 - 20:15

అప్పుడెప్పుడో హ్యాపీ డేస్ తో హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకొచ్చాడు టైసన్ రాహుల్. అయితే ఈసారి మామూలుగా రాలేదు. మంచి కథతో పాటు మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత సినిమాల అనుభవాలతో ఈసారి ఎంతో జాగ్రత్తగా వెంకటాపురం సినిమా చేశాడు టైసన్ అలియాస్ రాహుల్.

వెంకటాపురం సినిమాలో రాహుల్ మేకోవర్, నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా కమర్షియల్ గా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. రాహుల్ తో పాటు యూనిట్ అంతా ఓ మంచి ప్రయత్నం చేశారని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

వెంకటాపురం సినిమా రాహుల్ కెరీర్ కు మాత్రం ఈ సినిమా కచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇందులో పర్ఫార్మెన్స్, మేకోవర్ అతడికి మరిన్ని సినిమా అవకాశాలు తీసుకురావడం గ్యారెంటీ. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.