సైబ‌ర్ పోలీసులు భేష్ : రాజ‌మౌళి

Rajamouli appreciates Cyberabad police efforts
Saturday, May 20, 2017 - 19:15

బాహుబ‌లి 2ని పైరేటెడ్ వెర్స‌న్‌ని నెట్‌లో పెడుతామ‌ని బెదిరించిన వారిని హైద‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ వివ‌రాల‌ను తెలుసుకొనేందుకు రాజమౌళి చి హైద‌రాబాద్‌లోని సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ కార్యాలయానికి వెళ్లారు. ఏసీపీ రఘువీర్‌, డీసీపీ అవినాశ్‌ మహంతిని కలిశారు. 

వీరు మొద‌ట క‌ర‌ణ్ జోహర్‌ని బెదిరించార‌ట‌. త‌ర్వాత ఆర్కా మీడియా ఆఫీస్‌కి ఫోన్ చేసి... నేరుగా సర్వర్‌కు కనెక్ట్‌ చేసి పైరసీకి పాల్పడిన ఆ నిందితులు డబ్బు డిమాండ్ చేశార‌ట‌. పోలీసుల సహకారంతో వారిని బీహార్‌లో పట్టుకున్నార‌ట‌. రాష్ట్ర పోలీసుల చొరవతోనే వారిని అరెస్టు చేశార‌ని రాజ‌మౌళి తెలిపారు. సినీ పరిశ్రమ, ఆర్కా మీడియా తరఫున పోలీసుల‌కి కృతజ్ఞతలు తెలిపారు రాజ‌మౌళి. 

బాహుబ‌లి 2 పైర‌సీ నిరోధానికి తాము చాలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఐనా ఇలాంటి వారు పైర‌సీకి పాల్ప‌డుతూ సినిమా ప‌రిశ్ర‌మ‌ని కిల్ చేస్తున్నార‌ని రాజ‌మౌళి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.