చైనా లెక్కల్లో బొక్కలు: రాజమౌళి

Rajamouli says China collections don't bring much value
Thursday, June 1, 2017 - 16:00

చైనా లెక్కల్లో బొక్కలు చూపించిన రాజమౌళి

ప్రస్తుతం 'దంగల్' సినిమా చైనాలో బీభత్సంగా ఆడుతోంది. త్వరలోనే 'బాహుబలి 2' సినిమా కూడా చైనాలో విడుదలకాబోతోంది. అయితే చైనా వసూళ్లు చెప్పుకోడానికి తప్ప దేనికీ పనికిరావంటున్నాడు రాజమౌళి. కేవలం గ్రాస్ పెంచుకోడానికే తప్ప, జేబు నిండదని అంటున్నాడు. చైనా లెక్కల్లో లూప్ హోల్స్ ను బయపెట్టాడు.

చైనా చాలా పెద్ద దేశం. అక్కడ ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సరిపోడు. కనీసం 3, 4 డిస్ట్రిబ్యూటర్లు కావాలి. వచ్చిన డబ్బులో వాళ్లకు ఇచ్చేది, మిగతా ఖర్చులు పోనూ నిర్మాతకు కేవలం 12.5శాతం మాత్రమే మిగులుతుందని రాజమౌళి తేల్చిచెప్పాడు. ఉదాహరణకు చైనాలో ఓ సినిమాకు వంద కోట్లు వస్తే నిర్మాతకు కేవలం 12 కోట్లు మాత్రమే చేతికొస్తాయని వివరించాడు. దీనికి తన బాహుబలిని ఎగ్జాంపుల్ గా వివరించాడు రాజమౌళి.బాహుబలి-1కు చైనాలో ఏకంగా 7 మిలియన్ డాలర్లు వచ్చాయి. చెప్పుకోవడానికి ఇది చాలా పెద్ద మొత్తమే. కానీ ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్లకు పోగా నిర్మాతకు చేతికి పైసా కూడా రాలేదట. వచ్చింది అక్కడికక్కడే సరిపోయిందట. బాహుబలి-2 విషయంలో ఏం జరుగుతుందో చూడాలంటున్నాడు. దంగల్ లా ఓ రేంజ్ లో ఆడితే తప్ప చైనా నుంచి నిర్మాతలకు డబ్బులు రావంటున్నాడు.

చివరికి వేల కోట్లు ఆర్జిస్తున్న 'బాహుబలి 2' నుంచి కూడా నిర్మాతకు వచ్చేది చాలా తక్కువంటున్నాడు. పెట్టిన పెట్టుబడిపై పది శాతం వస్తే అదే పదివేలు అంటున్నాడు రాజమౌళి.