రజనీ మొదలెట్టేశాడు

రజనీకాంత్‌కి, ముంబైకి ఒక స్పెషల్ లింక్ ఉంది. ముంబైలో మాఫియా డాన్‌గా రజనీ నటిస్తే సినిమా బ్లాక్‌బస్టర్. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఎగ్జాంఫుల్...90లలో వచ్చిన "బాషా" మూవీ. మాణిక్ బాషాగా రజనీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పటికీ ఫిల్మ్ లవర్స్ చెప్పుకుంటారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ముంబై మాఫియా డాన్‌గా మారిపోయాడు రజనీ.
"కబాలి" దర్శకుడు పి.రంజిత్ రజనీ హీరోగా తీస్తున్న "కాలా" మూవీ ఇపుడు ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఆయన వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న పాత్ర పోషిస్తున్నాడు. ఒకపుడు ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన తమిళ మాఫియా డాన్..వరదరాజన్ ముదలియార్. రజనీకాంత్ ఆయనలాగే నల్లటి డ్రెస్సులు వేసకున్నాడు కాలా సినిమాలో. హ్యుమా ఖురేషీ హీరోయిన్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి ధనుష్ నిర్మాత.
ముంబైలోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ జరుపుకుంటుందట ఈ మూవీ.
- Log in to post comments