మా శ్రీదేవి ఆమే: నిర్మాత‌

Rakul Preet Singh confirmed to play Sridevi in NTR biopic
Wednesday, August 8, 2018 - 18:45

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర‌ని ర‌కుల్ ప్రీతి సింగ్ పోషించ‌నుంద‌ని తెలుగుసినిమా.కామ్ చాన్నాళ్ల క్రితమే న్యూస్ బ్రేక్ చేసింది. ఆ విష‌యాన్ని నిర్మాతల్లో ఒక‌రైన విష్ణు ఇందూరి ఇపుడు క‌న్‌ఫ‌మ్ చేశాడు. ర‌కుల్ బ‌దలు కంగన, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌ల‌ను మేక‌ర్స్ సంప్రదిస్తున్న‌ట్లు బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఆయ‌న క్లారిటీ ఇచ్చాడు.

"శ్రీదేవి పాత్ర‌కి మొద‌ట్నుంచి ర‌కుల్‌ప్రీత్‌ సింగ్‌ మా చాయిస్‌. శ్రీదేవి రోల్ కోసం ఏ బాలీవుడ్ హీరోయిన్‌ని అడ‌గ‌లేదు. ర‌కుల్ కి, శ్రీదేవికి ద‌గ్గ‌రి పోలీకలున్నాయి. పైగా ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కేవ‌లం ఒక చిన్న పాట‌, ఒక సీన్ మాత్ర‌మే ఉంటాయ,"ని నిర్మాత ఈ విష‌యంలో మ‌రింత క్లారిటీ ఇచ్చాడు.

ర‌కుల్ పై పాట‌, సీన్ త్వ‌ర‌లోనే చిత్రీక‌రిస్తార‌ట‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని బాల‌య్య‌, విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ బ‌యోపిక్‌లో ప‌లువురు పేరొందిన తార‌లు గెస్ట్ రోల్స్‌లో క‌నిపిస్తారు. బాల‌య్య త‌న తండ్రి ఎన్టీరామారావు పాత్ర పోషిస్తున్నాడు.