క‌త్తి స‌మేత రామ్‌చ‌ర‌ణ్‌

Ram Charan film's stills leaked
Wednesday, October 17, 2018 - 00:15

త‌న సినిమాల్లో బోయ‌పాటి క‌నిపంచ‌డం రెగ్యుల‌ర్‌. సినిమా మొద‌ట్లోనే క‌నిపించి..క్లాప్‌, స్టార్ట్..యాక్ష‌న్ అన‌డం ఎంత కామ‌నో, ఆయ‌న సినిమాల్లో హీరో క‌త్తి ప‌ట్టి న‌ర‌క‌డం అంతే కామ‌న్‌. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి తీస్తున్న వినయ విధేయ రామ సినిమాలో కూడా హీరో క‌త్తి ప‌ట్టి న‌రికే సీన్లు బోలెడ‌న్నీ ఉంటాయి. చ‌ర‌ణ్ చేతికి కత్తి మొలిసిందా అనిపించేలా ఉంటాయి కాబోలు తాజాగా లీక్ అయిన స్టిల్స్ చూస్తుంటే.

రామ్‌చ‌ర‌ణ్ పొడువాటి క‌త్తి ప‌ట్టుకొని రౌడీల‌ను త‌రుముతున్న కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. వైజాగ్‌లో చిత్రీక‌రణ చేస్తున్న సంద‌ర్భంగా బ‌య‌టికి వ‌చ్చిన‌ట్లున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జోరుగా సాగుతోంది. సినిమాకి సంబంధించిన తొలి లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్ విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఉంటుంద‌ని టాక్‌. 

కియారా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది మూవీ.