చరణ్-కొరటాల సినిమా.. ఒకేసారి 2 క్లారిటీలు

Ram charan, Korata Movie Clears 2 rumours
Sunday, July 16, 2017 - 11:30

చరణ్-కొరటాల సినిమా పక్కా అయింది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. మేట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి  తన సొంత బ్యానర్ లో చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. చరణ్ హీరో కమ్ నిర్మాతగా చేయబోతున్న మొదటి సినిమా ఇదే కానుంది. అయితే ఈ సినిమాతో మరో రెండు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చాడు చెర్రీ. 

 

చరణ్-మణిరత్నం సినిమా ఇంకా నలుగుతోందంటూ మొన్నటివరకు వార్తలొచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న రంగస్థలం కంప్లీట్ అయిన వెంటనే మణిరత్నం సినిమానే ఉంటుందని చాలా మంది భావించారు. కొరటాల శివ సినిమా ఎనౌన్స్ మెంట్ తో మణిరత్నంతో ఇప్పట్లో సినిమా ఉండదనే విషయం తేలిపోయింది.

 

మరోవైపు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలో కూడా నిజంలేదని తెలిపోయింది. జై లవకుశ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మరోసారి కొరటాలతో సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అప్పటికి రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉంటాడు కొరటాల. ఇలా ఒక ప్రకటనతో 2 సినిమాలపై క్లారిటీ వచ్చినట్టయింది.