నాగ్ మౌనం వెనక రీజన్?

Reason behind Nag's silence
Monday, July 17, 2017 - 13:45

సినిమాల విషయంలో నాగార్జున ఎప్పుడూ ఓ రూల్ కచ్చితంగా ఫాలో అవుతాడు. ఓ సినిమా చేస్తున్న టైమ్ లోనే నెక్ట్స్ చేయబోయే సినిమాపై ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తాడు. దాదాపు ఆరేళ్ల నుంచి ఇదే రూల్ ఫాలో అవుతున్నాడు మన్మధుడు. కానీ ఈసారి మాత్రం నాగ్ నుంచి క్లారిటీ రాలేదు. 'రాజుగారి గది 2' సినిమా ఓ కొలిక్కి వచ్చినప్పటికీ నెక్ట్స్ ఏంటనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు నాగ్.

నాగ్ డైరక్టర్స్ లిస్ట్ లో మొన్నటివరకు చందు మొండేటి, కల్యాణ్ కృష్ణ పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతానికి వీళ్లిద్దరూ ఫైనల్ అవ్వలేదు. చందు మొండేటి నాగార్జునకే కథ చెప్పినప్పటికీ, అది నాగచైతన్యకు వర్కవుట్ అయింది. ఇక నాగ్ కోసం బంగార్రాజు క్యారెక్టర్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడు కల్యాణ్ కృష్ణ. కానీ తన స్టోరీలైన్స్ తో నాగ్ ను మెప్పించలేకపోయాడు. దీంతో నాగార్జున నెక్ట్స్ సినిమాపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు నాగ్. నాగచైతన్యతో ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మించిన కింగ్.. అఖిల్ తో ప్రస్తుతం ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒకవేళ తను హీరోగా సినిమా ఏదీ ఓకే చేయకపోతే.. నిర్మాతగా నాగ్ మరో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.