ఎన్టీఆర్ కు విలన్ దొరికేశాడోచ్

Ronit Roy as villain in NTR's Jai Lava Kusa
Thursday, June 22, 2017 - 20:30

ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. హీరోయిన్లు కూడా సెట్ అయిపోయారు. ఇంకేముందని అంతా అనుకున్నారు. కానీ చాలామంది విలన్ విషయాన్ని మరిచిపోయారు. అవును.. 'జైలవకుశ' సినిమాకు మొన్నటివరకు విలన్ దొరకలేదు. ఎట్టకేలకు ఆ స్థానం భర్తీ అయింది బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ను జై లవకుశ సినిమాలో విలన్ గా తీసుకున్నారు.

మొదట ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ ను విలన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దునియా విలన్. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని రోనిత్ రాయ్ భర్తీ చేశాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు.

రోనిత్ రాయ్ సెలక్ట్ అవ్వడం, వెంటనే సెట్స్ పైకి రావడం కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోనిత్ రాయ్ తో కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. రోనిత్ రాయ్ ను టీంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్వీట్ చేసింది.