విక్ర‌మ్ కొడుకే శేఖ‌ర్ క‌మ్ముల హీరో!?

Sekhar Kammula selects Dhruv Vikram as his lead hero?
Tuesday, July 17, 2018 - 11:15

శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్ వంటి అగ్రెసివ్ హీరోల‌తో చేయాల‌నుకున్నాడు. కానీ కుద‌ర‌లేదు. ఇపుడు ఆయ‌న త‌న ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ హీరోని వెతికి పట్టుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆయ‌న సెల‌క్ట్ చేసిన హీరో ఎవ‌రో తెలుసా? ధ‌్రువ్‌...ఆయ‌న నెక్స్ట్ మూవీ హీరో అని ఇండ‌స్ట్రీలో టాక్ మొద‌లైంది. 

శేఖ‌ర్ క‌మ్ముల,  శేఖ‌ర్ టీమ్ మెంబ‌ర్స్‌ .. ఈ విష‌యంలో నోరు విప్ప‌డం లేదు. ఇంత‌కీ ధ్రువ్ ఎవ‌రు? 

అప‌రిచితుడు విక్ర‌మ్ కొడుకే ధ్రువ్‌. విక్ర‌మ్ త‌న కుమారుడిని అర్జున్ రెడ్డి రీమేక్‌లో త‌మిళంలో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు. ఆ తొలి సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. త‌మిళంలో తొలి చిత్రం విడుద‌ల కాక‌ముందే తెలుగులోనూ ఇంట్ర‌డిక్ష‌న్ సినిమా ద‌క్కింద‌ట‌. ఐతే ఇది నిజంగా జ‌రిగేనా లేక కేవ‌లం ఊహాగానమేనా అన్న‌ది తెలియాలి.

శేఖ‌ర్ క‌మ్ముల త‌న సొంత బ్యాన‌ర్‌పైనే కొత్త సినిమాని తీయ‌నున్నాడు. ఇది వాస్త‌వం. ఎందుకంటే ఫిదా సినిమా లాభాల‌న్నీ దిల్‌రాజుకే వెళ్లాయి. అంత భారీ హిట్ వ‌ల్ల శేఖ‌ర్‌కి ద‌క్కిన ఫాయిదా నామ మాత్రం. శేఖ‌ర్ ఇపుడు డ‌బ్బులు చేసుకునే ప‌నిలో ఉన్నాడు. ఫిదా క్రేజ్‌ని త‌న సినిమాకి ఉప‌యోగించుకుంటాడు. శేఖ‌ర్ స‌రైన నిర్ణ‌య‌మే తీసుకున్నాడ‌ని చెప్పాలి.