చిరు ఇంట్లో చోరీ
Submitted by admin on Mon, 2017-11-06 15:19
Servant in police custody for theft at Chiranjeevi's residence
Monday, November 6, 2017 - 15:15
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రెండు లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగిందని చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంట్లో పని చేస్తున్న చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరు ఇంట్లో చెన్నయ్య కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
- Log in to post comments