నాగశౌర్య సరసన అర్జున్‌రెడ్డి పిల్ల

Shalini Pandey gets big movie
Sunday, March 3, 2019 - 17:00

రీసెంట్ గా కల్యాణ్ రామ్ సరసన "118" సినిమా చేసింది షాలినీ పాండే. ఆ మూవీ థియేటర్లలోకి కూడా వచ్చింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది షాలినీ. ఈ మేరకు అగ్రిమెంట్ పూర్తయింది. రేపోమాపో అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. 

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నాగశౌర్యను హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించబోతున్నాడు సుకుమార్. ఈ విషయాన్ని ఈమధ్యే అధికారికంగా ప్రకటించారు. సుక్కూ అసిస్టెంట్ కాశీ విశాల్ దర్శకుడిగా మారబోతున్న ఈ సినిమాలో షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. క్యారెక్టర్ పరంగా షాలినీ అయితే బాగుంటుందని భావించడంతో వెంటనే ఆమెను సంప్రదించి కాల్షీట్లు తీసుకున్నారు. 

ఈనెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీ కోసం చిన్నపాటి మేకోవర్ కూడా ట్రై చేస్తున్నాడు నాగశౌర్య. సుకుమార్ తో పాటు శరత్ మరార్ సహ-నిర్మాతగా సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా.