‘శంకరాభరణం’.. నేటితో 40 ఏళ్ళు!

Shankarabharanam completes 40 years
Sunday, February 2, 2020 - 10:30

కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’... ఫిబ్రవరి 2, 1980న విడుదలైంది. కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై  ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు. తెలుగునాటే కాదు  తమిళనాడు, కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది. అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు చిత్రం ఇదే. 

ప్రతి తెలుగు వాడు ఇది మన సినిమా సినిమా అని గర్వంగా చెప్పుకొనే చిత్రం... శంకరాభరణం.

బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు ,   ఉత్తమ గాయకురాలిగా వాణి జయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా  కె.వి.మహదేవన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. జంధ్యాల మాటలు, మహదేవన్ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం గాత్రం, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల అభినయ కౌశలం  ‘శంకరాభరణం’ సినిమాని వన్నెతరగని చిత్రరాజంగా నిలిపాయి.