ఫారిన్‌లో శర్వానంద్ ఎంజాయ్

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో సినిమాలు చేశాడు. కానీ విదేశాలకు వెళ్లి షూటింగ్ మాత్రం చేయలేకపోయాడు శర్వానంద్. కెరియర్ ప్రారంభంలో వెన్నెల అనే సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే జరిగింది. కానీ అపుడు శర్వానంద్ హీరో కాదు. ఎట్టకేలకు రాధ సినిమాతో ఆ ముచ్చట తీర్చుకున్నాడు. అందులో రాబిట్ పిల్ల అనే సాంగ్ ను ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే తీశారు. ఆ మూవీ ఇచ్చిన కిక్ తో మరోసారి ఫారిన్ లొకేషన్ కు షిఫ్ట్ అయ్యాడు శర్వానంద్.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమా చేస్తున్నాడు శర్వ. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా విదేశాల్లోనే జరిగింది. కథ ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలకు ఫారిన్ బ్యాక్ డ్రాప్ అవసరం. అందుకే యూనిట్ అంతా ఫారిన్‌కి వెళ్లి సీన్లు తీసేసింది.
మహానుభావుడు సినిమా తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీని ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథ కూడా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. సో.. ప్రాజెక్టు ఓకే అయితే శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ విదేశాలకు వెళ్లడం గ్యారెంటీ అన్నమాట. అలా ఫారిన్ షూటింగ్‌ల సరదాని ఇన్నేళ్ల తర్వాత తీర్చుకుంటున్నాడు. అవును..దేనికైనా టైమ్ రావాలి కదా. స్టార్‌డమ్ వస్తే అన్ని సరదాలు తీరిపోతాయి. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి, రాధ... ఇలా హిట్స్, యావరేజ్‌లతో ఆయన కెరియర్ గ్రాఫ్ బాగా పెరిగిందిపుడు. స్టార్‌డమ్ కూడా వచ్చేసింది.
- Log in to post comments