రాధతో శర్వానంద్ కోరిక తీరింది

Sharwanand fulfils dream with Radha movie
Monday, May 15, 2017 - 16:15

టైటిల్ చూసి తప్పుగా అనుకోవద్దు. ఎప్పట్నుంచో మనసులో నిక్షిప్తంగా ఉండిపోయిన ఓ చిలిపి కోరికను తన తాజా సినిమాతో శర్వానంద్ తీర్చేసుకున్నాడు. అదేంటో తెలుసా.. ఫారిన్ లొకేషన్ లో సాంగ్ షూటింగ్. అవును.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే.

 

కెరీర్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు శర్వానంద్. కానీ అతడి సినిమాలకు సంబంధించి ఏ ఒక్క సాంగ్ ఫారిన్ లొకేషన్ లో షూట్ జరుపుకోలేదు. అందుకే రాధ సినిమా కోసం పట్టుబట్టి మరీ ఫారిన్ వెళ్లాడు శర్వానంద్. అలా తెరకెక్కిందే రాబిట్ పిల్ల సాంగ్. ఈ పాటతో శర్వానంద్ చిలిపి కోరిక తీరిపోయింది.

 

శర్వానంద్ కు సంబంధించి శతమానంభవతి షూట్ మొత్తం ఇక్కడే జరిగింది. రన్ రాజా రన్ సినిమా కూడా ఇండియాలోనే తీశారు. అంతకుముందొచ్చిన "మళ్లీమళ్లీ ఇది రాని రోజు" సినిమాలో కొన్ని సన్నివేశాల్ని విదేశాల్లో తీసినా అందులో శర్వానంద్ లేడు. తాజాగా వచ్చిన రాధ సినిమాను కూడా ఇక్కడే కంప్లీట్ చేశారు. దాదాపు అన్ని పాటలు ఇక్కడే తీసేశారు. దీంతో తన కోరిక అలానే మిగిలిపోతుందేమో అనే భయంతో.. పట్టుబట్టి మరీ ఓ సాంగ్  కోసం ఫారిన్ వెళ్లాడు శర్వానంద్.