పెళ్లి శ్రియాది కాదు: త‌ల్లి

She's not getting married, says Shriya Saran's mother
Wednesday, February 7, 2018 - 16:00

శ్రియా ఒక ర‌ష్య‌న్ యువ‌కుడిని పెళ్లి చేసుకోబోతుంద‌న్న వార్త‌ల్లో క‌ల‌క‌లం రేగింది. ముంబై నుంచి మద్రాస్ వ‌ర‌కు అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లో హాట్ టాఫిక్ అయింది. ఐతే ఈ ప్ర‌చారాన్ని శ్రియా తోసిపుచ్చ‌లేదు. ఆమెకి ట్విట్ట‌ర్ అకౌంట్ ఉంది, ఫేస్‌బుక్‌లోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. కానీ ఆమె వీటిపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

ఐతే ఈ ప్ర‌చారాన్ని శ్రియా త‌ల్లి త‌ప్పు ప‌ట్టిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక ఒక వార్త‌ని ప్ర‌చురించింది. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం శ్రియా పెళ్లి చేసుకోవ‌డం లేద‌ట‌. రాజ‌స్థాన్‌లో పెళ్లి జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే, పెళ్లి కోసం శ్రియా న‌గ‌లు, దుస్తుల కొన్న మాట కూడా నిజ‌మేన‌ట‌. కానీ ఈ షాపింగ్ త‌న కోసం కాద‌ట‌, శ్రియా మిత్రురాలి పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రగ‌నుంద‌ట‌, దాని కోసం ఆమె షాపింగ్ చేసింద‌ని శ్రియా త‌ల్లి చెప్పుకొచ్చింది.

ఐతే శ్రియా త‌ల్లి వివ‌ర‌ణ అంత సంతృప్తిక‌రంగా లేదు. శ్రియా డేటింగ్‌, ర‌ష్య‌న్ యువ‌కుడితో ప్రేమ గురించి ఇద్ద‌రూ తోసిపుచ్చ‌లేదు. మ‌రి కొన్నాళ్లూ ఆగితే అస‌లు విష‌యం తెలుస్తుంది. శ్రియాకిపుడు 35 ఏళ్లు.