మొగుడితో శ్రియా ముద్దులాట‌

Shirya kissing her hubby pic goes viral
Wednesday, March 21, 2018 - 20:45

"రాను రాను అంటూనే చిన్న‌ది రాములోరి గుడికొచ్చే..." అని తేజ తీసిన "జ‌యం" సినిమాలో ఒక పాట ఉంది. అబ్బే నా పెళ్లి ఇపుడే కాదు అంటూ శ్రియా నిన్న మొన్న‌టి వ‌ర‌కు అబ‌ద్దాల మీద అబ‌ద్దాలు చెప్పింది. ఆఖ‌రికి పెళ్లి కూడా మీడియా కంట‌ప‌డ‌కుండా గ‌ప్‌చుప్‌గా చేసుకొంది. ఇక తీరా ఆ పెళ్లి ఫోటోలు లీక్ అయ్యాక ఇపుడు రెచ్చిపోతోంది.

రాను రాను అన్న పాట‌లాగే ఇపుడు ఆమె ప్ర‌వర్తిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు సీక్రెసీ మెయింటెయ‌న్ చేసింది. ఇపుడు ప‌బ్లిక్‌గా భ‌ర్త‌కి లిప్ టు లిప్ కిస్సులు ఇస్తోంది.

పెళ్లి త‌ర్వాత ఇటీవ‌ల జ‌రిగిన మ‌రో సెల‌బ్రేష‌న్స్‌లో ఇలా భ‌ర్త ఆండ్రికి ముద్దు పెడుతున్న ఫోటో ఒక‌టి ఇపుడు ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అవుతుంది.